Online Pujalu - ఆన్లైన్ పూజలు

తెలుగు అంతర్జాల ఆధ్యాత్మిక బ్లాగు.

23, సెప్టెంబర్ 2021, గురువారం

భవాయ చంద్రచూడాయ, నిర్గుణాయగుణాత్మనే

కాలకాలాయ రుద్రాయ, నీలగ్రీవాయ మంగళం


వృషారూఢాయ భీమాయ, వ్యాఘ్రచర్మాంబరాయచ

పశూనాం పతయే తుభ్యం, గౌరీకాంతాయ మంగళం


భస్మోద్దూళిత దేహాయ, నాగయజ్ణోపవీతినే

రుద్రాక్ష మాలా భూషాయ, వ్యోమకేశాయ మంగళం


సూర్యచంద్రాగ్ని నేత్రాయ, నమ: కైలాస వాసినే

సచ్చితానంద రూపాయ, ప్రమధేశాయ మంగళం


మృత్యుంజయాయ సాంబాయ, సృష్టిస్థిత్యంతకారినే

త్రయంబకాయ ప్రశాంతాయ, త్రిలోకేశాయ మంగళం


గంగాధరాయ సోమాయ, నమో హరిహరాత్మనే

ఉగ్రాయ త్రిపురఘ్నాయ, వామదేవాయ మంగళం


సద్యోజాతాయ శర్వాయ, భవ్యజ్ణాన ప్రదాయినే

ఈశానాయ నమస్తుభ్యం, పంచవక్త్రాయ మంగళం


సదాశివస్వరూపాయ, నమస్తత్పురుషాయచ

అఘోరాయచ ఘోరాయ, మహాదేవాయ మంగళం


శ్రీ చాముండా ప్రేరితేన, రచితం మంగళాష్టకం

తస్యాభీష్ట ప్రదం శంభో: య: పఠేన్మంగళాష్టకం     

17, జూన్ 2021, గురువారం

గాయియే గణపతి జగబంధన,

శంకర సువన భవానీ నందన.


సిద్ది సదన గజవదన వినాయక,

కృపాసింధు సుందర సబలాయక.


మోదకప్రియ ముద మంగళ దాతా,

విద్యా వారిధి బుద్ది విధాతా.


మాంగత తులసీదాస కర జోరే, 

బసహి రామ సియ మానస మోరే.

ప్రాత: స్మరామి భవభీతిమహార్తిశాంత్యై

నారాయణం గరుడవాహనమబ్జనాభమ్,

గ్రహాభిభూతవరనావరణ ముక్తిహేతుం

చక్రాయుధం తరుణవారిజపత్రనేత్రమ్.


ప్రాతర్నమామి మనసా వచసా చ మూర్థ్నా

పాదారవిందయుగళం పరమస్య పుంస:,

నారాయణస్య నరకార్ణవతారణస్య

పారాయణ ప్రవణవిప్రపరాయనస్య.


ప్రాతర్భజామి భజతామభయంకరం తం

ప్రాక్సర్వజన్మకృతపాపభయాపహత్యై,

యో గ్రాహవక్త్రపతితాంఘ్రిగజేంద్రఘోర

శోకప్రణాశనకరో ధృతశంఖచక్ర:


ఇతి శ్రీ విష్ణో: ప్రాత: స్మరణమ్

ఏకదంతం మహాకాయం, తప్తకాంచనసన్నిభమ్,

లంబోదరం విశాలాక్షం, వందేహం గణనాయకమ్.


మౌంజీ కృష్ణాజినధరం, నాగయజ్ణోపవీతినమ్,

బాలేందుశకలం మౌళౌ, వందేహం గణనాయకమ్.


చిత్రరత్న విచిత్రాంగం, చిత్రమాలా విభూషితమ్,

కామరూపధరం దేవం, వందేహం గణనాయకమ్.


గజవక్త్రం సురశ్రేష్టం, కర్ణచామర భూషితమ్,

పాశాంకుశధరం దేవం, వందేహం గణనాయకమ్.


మూషకోత్తమమారుహ్య దేవాసురమహాహవే,

యోద్దుకామం మహావీరం, వందేహం గణనాయకమ్.


యక్షకిన్నర గంధర్వ, సిద్దవిద్యాధరైస్సదా,

స్తూయమానం మహాబాహం, వందేహం గణనాయకమ్.


అంబికాహృదయానందం, మాతృభి: పరివేష్టితమ్,

భక్తప్రియం మదోన్మత్తం, వందేహం గణనాయకమ్.


సర్వవిఘ్నహరం దేవం, సర్వవిఘ్నవివర్జితమ్,

సర్వసిద్ది ప్రదాతారం, వందేహం గణనాయకమ్.


గణాష్టకమిదం పుణ్యం, య: పఠేత్ సతతం నర:,

సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్.


ఇతి శ్రీ గణనాయకాష్టకమ్.

16, జూన్ 2021, బుధవారం

 ప్రాత:స్మరామి రఘునాథ ముఖారవిందం,

మందస్మితం మధురభాషి విశాలఫాలమ్,

కర్ణావలంబిచలకుండలశోభిగండం,

కర్ణాంత దీర్ఘనయనం నయనాభిరామమ్.


ప్రాతర్భజామి రఘునాథకరారవిందం,

రక్షోగణాయ భయదం వరదం నిజేభ్య:,

యద్రాజసంసది విభజ్య మహేశచాపం,

సీతాకరగ్రహణ మంగళమాప సద్య:


ప్రాతర్నమామి రఘునాథ పదారవిందం,

వజ్రాంకుశాదిశుభరేఖి సుఖావహం మే,

యోగీంద్రమానస మధువ్రతసేవ్యమానం,

శాపాపహం సపది గౌతమ ధర్మపత్న్యా:.


ప్రాతర్వదామి వచసా రఘునాథనామ,

వాగ్దోషహారి సకలం శమలం నిహంతి,

యత్వార్వతీ స్వపతినా సహ భోక్తుకామా,

ప్రీత్యా సహస్ర హరినామ సమం జజాప.


ప్రాత: శ్రయే శ్రుతినుతాం రఘునాథ మూర్తిం,

నీలాంబుజోత్పలసితేతరత్ననీలామ్,

ఆముక్తమౌక్తికవిశేష విభూషణాఢ్యాం,

ధ్యేయాం సమస్తమునిభిర్జనముక్తిహేతుమ్,


య: శ్లోకపంచకమిదం ప్రయత: పఠేద్ఢి,

నిత్యం ప్రభాత సమయే పురుష: ప్రబుద్ధ:,

శ్రీ రామకింకరజనేషు స ఏవ ముఖ్యో,

భూత్వా ప్రయాతి హరిలోకమనన్యలభ్యమ్.


ఇతి శ్రీ రామస్య ప్రాత: స్మరణమ్.

14, జూన్ 2021, సోమవారం

 గజాననాయ గాంగేయ సహజాయ సదాత్మనే,

గౌరీప్రియ తనూజాయ గనేశాయాస్తు మంగళమ్.


నాగయగజ్ణోపవీతాయ నతవిఘ్నవినాశినే,

నంద్యాది గణనాధాయ నాయకాయాస్తు మంగళమ్.


ఇభవక్రాయ చేంద్రాది వందితాయ చిదాత్మనే,

ఈశానప్రేమపాత్రాయ చేష్టదాయాస్తు మంగళమ్.


సుముఖాయ సుశుండాగ్రోత్క్షిప్తామృతఘటాయ చ,

సురబృంద నివేష్యాయ సుఖదాయాస్తు మంగళమ్.


చతుర్భుజాయ చంద్రార్థ విలసన్మస్తకాయ చ,

చరణావనతానంత-తారణాయాస్తు మంగళమ్.


వక్రతుండాయ వటవే వన్యాయ వరదాయ చ,

విరూపాక్ష సుతాయాస్తు విఘ్ననాశాయ మంగళమ్.


ప్రమోదామోదరరూపాయ సిద్దివిజ్ణానరూపిణే,

ప్రకృష్ట పాపనాశాయ ఫలదాయాస్తు మంగళమ్.


మంగళం గణనాధాయ మంగళం హరసూనవే,

మంగళం విఘ్నరాజాయ విఘ్నహర్త్రేస్తు మంగళమ్.


శ్లోకాష్టకమిదం పుణ్యం మంగళప్రద మాదరాత్,

పఠితవ్యం ప్రయత్నేన సర్వవిఘ్ననివృత్తయే.


ఇతి శ్రీ గణేశ మంగళాష్టకమ్.

 ుక్లాంబరధరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజం ।

ప్రసన్నవదనం ధ్యాయేత్, సర్వ విఘ్నోపశాంతయేయత్ ॥


అగజానన పద్మార్కం, గజానన మహర్నిశమ్ ।

అనేకదంతం భక్తానాం, ఏకదంత ముపాస్మహే ॥


గజాననం భూతగణాధి సేవితం, కపిత్థజంబూఫల చారుభక్షణమ్ ।

ఉమాసుతం శోకవినాశకారకం, నమామి విఘ్నేశ్వర పాదపంకజమ్ ॥


స జయతి సింధురవదనో దేవో యత్పాదపంకజస్మరణమ్ ।

వాసరమణిరవ తమసాం రాశీన్నాశయతి విఘ్నానామ్ ॥


సుముఖశ్చ్హహ ఏకదంతస్య, కపిలో గజకర్ణిక: ।

లంబోదరశ్చ్హహ వికటో, విఘ్ననాశో వినాయక: ॥


ధూమకేరుర్గణాధ్యక్షో, ఫాలచంద్రో గజానన: ।

వక్రతుండ శ్శూర్పకర్ణో, హేలంబ: స్కందపూర్వజ: ॥


షోడశైతాని నామాని, య: పఠేచృణుయాదపి ।

విద్యారంభే వివాహేచ, ప్రవేశే నిర్గమే తథా ।

సంగ్రామే సంకటై చైవ, విఘ్నతస్య నజాయతే ॥


విఘ్నధ్వాంత నివారణైక తరణిర్విఘ్నాటవీ హవ్యవా-

డ్విఘ్నవ్యాళ కులస్య మత్త గరుడో విఘ్నేభ పంచానన:

విఘ్నోత్తుంగ గిరిప్రభేదన పరిర్విఘ్నాబ్ధి కుంభోద్భవో

విఘ్నాఘౌఘు ఘనప్రచండ పవనో విఘ్నేశ్వర: పాతుమామ్ ॥


ఇతి శ్రీ గణపతి వందనమ్.

 ఏటా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచీ ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తారు. దేవీ నవరాత్రులలో భాగంగా, అమ్మవారిని ఒక్కోరోజు ఓక్కో రూపంలో పూజిస్తారు. 


అమ్మవారి ఒక్కో రూపానికీ ఒక్కో పూజ ఉన్నట్లే అమ్మవారికి సమర్పించే నైవేద్యం కూడా వేర్వేరుగా ఉంటుంది. ఏ రూపంలో ఉన్న అమ్మవారికి ఏ నైవేద్యం అంటే ఇష్టమో తెలుసుకుందాం.


తొలిరోజు - శ్రీ బాలత్రిపుర సుందరీ దేవి, పొంగల్

రెండో రోజు - గాయత్రీ దేవి, పులిహోర

మూడో రోజు - అన్నపూర్ణా దేవి, కొబ్బరి అన్నం

నాల్గో రోజు - కాత్యాయని దేవి, గారెలు

ఐదో రోజు - లలితా దేవి, దద్ధోజనం (పెరుగు అన్నం)

ఆరో రోజు - శ్రీ మహాలక్ష్మీ దేవి, రవ్వ కేసరి

ఏడో రోజు - మహా సరస్వతి దేవి, కదంబం

ఎనిమిదో రోజు - మహిషాసుర మర్ధిని, బెల్లం అన్నం

తొమ్మిదో రోజు - రాజరాజేశ్వర దేవి, పరమాన్నం.

 బియ్యం, పాలు, బెల్లం ఉంటే చాలు చక్కెర పొంగలి తయారవుతుంది, సులభంగా చేసుకోగలిగే చక్కెర పొంగలి ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


కావలసిన పదార్థాలు:


బియ్యం - 1 కప్పు

పెసరపప్పు - 1/2 కప్పు

బెల్లం - 1/2 కప్పు

నీళ్లు - 4 గ్లాసులు

నెయ్యి - 1/4 కప్పు

జీడిపప్పు - 10

కిస్మిస్ - 10

కొబ్బరి ముక్కలు - 6

యాలకుల పొడి - చిటికెడు

పచ కర్పూరం పొడి - చిటికెడు

జాజికాయ పొడి - చిటికెడు


తయారీ విధానం:


స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసి పెసర పప్పును దోరగా వేయించుకోవాలి, వేయించుకున్న పెసర పప్పుకి బియ్యం కలిపి ఉడికించాలి. వేరే గిన్నె లో బెల్లం వేసి కొన్ని నీళ్లు పోసి చిన్న మంటపైన ఉడికించాలి, బెల్లం పానకం చుక్కని నీటిలో వేస్తే కరగకుండా అడుగుభాగానికి చేరుకున్నట్లయితే పానకం తయారయినట్టే. ఈ పానకంలో ఉడికించి పెట్టుకున్న బియ్యం, పెసర పప్పు మిశ్రమాన్ని వేసి కలిపి చిన్న మంటపైన అయిదు నిముషాలు ఉడికించాలి, తరవాత నెయ్యి వేసి మరికాసేపు ఉడికించాలి, తరవాత యాలకుల పొడి, పచ కర్పూరం పొడి, జాజికాయ పొడి , జీడీపప్పు, కిస్మిస్ వేసి కలిపితే చక్కర పొంగలి తయారు అవుతుంది.


భగవంతునికి అర్పించడానికి చక్కెర పొంగలి సిద్దం.

 శ్రీ కృష్ణుని నామములు:


అచ్యుతుడు

అనంతుడు

అప్రతిమ ప్రభావుడు

అరిసూదనుడు

జనార్దనుడు

దేవదేవుడు

దేవవరుడు

దేవేశుడు

పరమేశ్వరుడు

పురుషోత్తముడు

భగవంతుడు

ఆద్యుడు

కమలపత్రాక్షుడు

కృష్ణుడు

కేశవుడు

భూతభావనుడు

భూతేశుడు

మధుసూదనుడు

మహాత్ముడు

మహాబాహువు

మాధవుడు

యాదవుడు

యోగి

యోగేశ్వరుడు

కేశి నిషూధనుడు

గోవిందుడు

జగత్పతి

జగన్నివాసుడు

వార్షేయుడు

వాసుదేవుడు

విశ్వమూర్తి

విశ్వేశ్వరుడు

విష్ణువు

సర్వుడు

సహస్రబాహువు

హృషీకేశుడుఅర్జునుడి నామములు:


అనఘుడు

అనసూయుడు

అర్జునుడు

కపిధ్వజుడు

కిరీటి

కురుప్రవీరుడు

కౌంతేయుడు

గుడాకేశుడు

తాత

దేహభీతాంవరుడు

ధనుంజయుడు

పరస్తవుడు

పాండవుడు

పార్థుడు

పురుషర్షభుడు

భరతర్షభుడు

భరత శ్రేష్ఠుడు

భరత సత్తముడు

 భారతీయ వేదాంత దర్శనం సర్వస్వం భగవద్గీత లో సాక్షాత్కరిస్తుంది, పుట్టిన ప్రతివాడికి సంబంధించిన విషయాలే భగవద్గీత లో చెప్పబడినవి. 


భగవద్గీత ను నియమం తో పారాయణ చేయటం వలన పుణ్యం పెరిగి మంచి ఫలాలని అనుభవిస్తారు. అంతేకాని పాపాలు పోతాయి అని భగవద్గీత పారాయణ చేయకండి, పాపాలు తగ్గవు పాపాలకి ఫలితాలని అనుభవించక తప్పదు, కానీ పుణ్యం పెరిగి మంచి ఫలితాలని పొందవచ్చ్హు.


1. అర్జున విషాద యోగం : దీనిని చదవడం వలన మానవుడికి పూర్వజన్మ స్మృతి కలుగుతుంది.


2. సాంఖ్య యోగం : దీనిని చదవడం వలన ఆత్మ స్వరూపం తెలుస్తుంది.


3. కర్మయోగం : దీన్ని చదవడం వలన ప్రేతత్వం నశిస్తుంది.


4,5. జ్ణానయోగం , కర్మ సన్యాస యోగం : ఈ అధ్యాయాలు పారాయణ వలన చెట్లు, పశువులు, పక్షులు కూడా ఉత్తమ గతిని పొందుతాయని అంటారు.


6. ఆత్మ సంయమ యోగం : ఈ అధ్యాయ పారాయణ వలన సమస్త దానాల ఫలితం కలుగుతుంది.


7. విజ్ణాన యోగం : ఈ అధ్యాయ పారాయణ వలన జన్మ రాహిత్యం కలుగుతుంది.


8. అక్షర పరబ్రహ్మ యోగం : ఈ అధ్యాయ పారాయణ వలన స్థావరత్వం, బ్రహ్మరాక్షసత్వం తొలగిపోతుంది.


9. రాజవిద్యా రాజగుహ్య యోగం : ఈ అధ్యాయ పారాయణ వలన ఇతరుల దగ్గరనుండి ఏదయినా వస్తువు తీసుకున్నందుకు వారి నుండి మనకి సంక్రమించిన పాపం నశిస్తుంది.


10. విభూతియోగం : ఈ అధ్యాయ పారాయణ వలన ఆశ్రమ ధర్మాన్ని సక్రమంగా నిర్వహిస్తే ఏ పుణ్యం కలుగుతుందో ఆ పుణ్యం కలుగుతుంది, జ్ణానం పెరుగుతుంది.


11. విశ్వరూప సందర్శన యోగం : ఈ అధ్యాయ పారాయణ వలన ముక్తి లభిస్తుంది.


12. భక్తి యోగం : ఈ అధ్యాయ పారాయణ వలన ఇష్టదేవతా కటాక్ష్యం లభిస్తుంది.


13. క్షేత్ర క్షేత్రజ్ణ విభాగ యోగం : ఈ అధ్యాయ పారాయణ వలన అజ్ణానం నశిస్తుంది.


14. గుణత్రయ విభాగ యోగం : ఈ అధ్యాయ పారాయణ వలన వ్యభిచార దోశం నశిస్తుంది.


15. పురుషోత్తమ ప్రాప్తి యోగం : ఈ అధ్యాయ పారాయణ వలన ఆహార శుద్ది కలుగుతుంది.


16. దైవాసుర సంవద్విభాగ యోగం : ఈ అధ్యాయ పారాయణ వలన బల పరాక్రమాలు, సుఖం లభిస్తాయి.


17. శ్రద్దాత్రయ విభాగయోగం : ఈ అధ్యాయ పారాయణ వలన వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది.


18. మోక్ష సన్యాస యోగం : ఈ అధ్యాయ పారాయణ వలన సమస్త యజ్ణాచరణ ఫలం కలుగుతుంది.

 1.  గీత

2.  గంగ

3.  గాయత్రి

4.  సీత

5.  సత్య

6.  సరస్వతి

7.  బ్రహ్మవిద్య

8.  బ్రాహ్మవల్లి

9.  త్రిసంధ్య

10. ముక్తి దేహిని

11. అర్థమాత్ర

12. చిదానంద

13. భవాగ్ని

14. భ్రాంతినాశిని

15. వేదత్రయి

16. వర

17. అనంత

18. తత్వార్థజ్ణానమంజరి

 1. వేకువజామున నిద్ర లేవాలి, స్నానం, జపం, ధ్యానం చేయాలి.

2. సాత్వికాహారం తీసుకోవాలి, ఎక్కువగా తినవద్దు.

3. జపం, ధ్యానం చేయటానికి పద్మాసనం లో కాని సిద్దాసనం లో కానీ కూర్చ్హోవాలి.

4. ప్రతిరోజు జపం, ధ్యానం చేయాలి.

5. సంపాదించినదానిలో పది శాతం దానం చేయాలి.

6. ప్రతి రోజు భగవద్గీత కాని, ఏదయినా భక్తి సంబంధమయిన పుస్తకం కాని చదవాలి.

7. ప్రాణశక్తి ని సంరక్షించుకోవాలి, అనవసరమయిన పనులు కానీ ఆలోచనలు కానీ చేయకూడదు.

8. పొగ త్రాగటం, మత్తు పానీయ సేవనం చేయకూడదు, రాజసిక ఆహారం వదిలివేయటానికి ప్రయత్నించండి.

9. ఏకాదశి రోజు ఉపవాసం ఉండండి, లేదా పాలు ఫలాలు తినండి.

10. ప్రతిరోజు ఒక గంట అయినా మౌనాన్ని పాటించండి, భోజనం చేసేటప్పుడు కూడా మౌనాన్ని పాటించండి.

11. ఎలాఓటి పరిస్థితులలో అయినా సత్యాన్నే పలకండి, తక్కువగా మాట్లాడండి, మధురంగా మాట్లాడటానికి ప్రయత్నించండి.

12. కోరికలను తగ్గించుకోవాలి, తృప్తిగల జీవితాన్ని గడపాలి.

13. ఇతరుల మనోభావాలకు బాధ కలిగించకూడదు, అందరిపట్ల దయ కలిగి ఉండాలి.

14. నీవు చేసిన తప్పుల గురించి విశ్లేషించుకోవాలి.

15. సేవకులపైన ఆధారపడరాదు, స్వయం గా పనులని చేసుకునే అలవాటు మంచిది.

16. పొద్దున్న లేవగానే, రాత్రి పడుకునే ముందు భగవంతుడిని తప్పనిసరిగా స్మరించుకోవాలి.

17. మెడలో కాని, జేబులో కాని ఎప్పుడూ జపమాల ఉంచుకోవాలి.

18. " సాధారణ జీవితం, ఉన్నత ఆలోచనలు " అన్న నీతివాక్యాన్ని నమ్మి పాటించాలి.

19. నిజమయిన సాధువులు, సన్యాసులు , బీదవారు, రోగులకి సేవ చేయాలి.

20. ప్రతిదినమూ డైరీ రాయాలి, చేసిన మంచి పనులను గురించి, రేపు చేయాల్సిన పనులను గురించిన దినచర్య రాసుకోవాలి, దినచర్యకి కట్టుబడి ఉండాలి.

21. సదాలోచన, సద్భావం, సత్కర్మ, సత్వాక్కు అలవటు చేసుకోవాలి.

22. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల వంటి దుర్గుణాలను తొలగించుకోవాలి.

23. కరుణ, ప్రేమ, దయ, ఓర్పు, పట్టుదల, ధైర్యం, సత్యం వంటి సద్గుణాలను పెంచుకోవాలి.

24. జై శ్రీరాం, ఓం నమ: శివాయ, ఓం నమో నారాయణాయ వంటి మీ ఇష్ట మంత్రాలని ప్రతిరోజు ఒక పదిహేను నిమిషాలు అయినా ఒక నోటుబుక్కు లో రాయాలి.


 1. ఈశావాస్యోపనిషత్తు


"ఎవరు తనలోని ఆత్మలో అన్నింటిని, అన్నింటిలో తన ఆత్మని దర్శిస్తారో, వారు ఎన్నటికి విరక్తి చెందరు".


2. కఠోపనిషత్తు


"సూక్ష్మాతి సూక్ష్మమయిన దివ్యాతిదివ్యమయిన ఆత్మ ప్రతి జీవి మనసులో ఉంది, ప్రశాంతమయిన మనస్సు, ఇంద్రియ నిగ్రహం, కోరికలకు దూరంగా ఉన్నవాడు, ఆత్మయొక్క దివ్యత్వాన్ని తెలుసుకుని, దుఖం నుండి విముక్తి పొందుతాడు".


3. ముండకోపనిషత్తు


"ఓంకారం [ప్రణవం] ఒక ధనస్సు, మనసు ఒక బాణం, బ్రహ్మమే లక్ష్యం. ఏకాగ్రత, మనోనిబ్బరం కలిగిన వ్యక్తి ప్రయోగించిన ఆ బాణం ఆ లక్ష్యం లో లీనమయినప్పుడు తాను కూడా బ్రహ్మం లో లీనమయిపోతాడు".


"ప్రకాశవంతమై, నిరాకారమై, సర్వవ్యాప్తియై, అంతర్ బహిప్రదేశాలలో స్థిరమై, జన్మ లేని, ప్రాణం లేని, మనస్సు లేని, అవ్యాకృతికి అతీతమై, సర్వాతీతమైనవాడే భగవంతుడు".


4. తైత్తీరియ ఉపనిషత్తు


"దేనిని చేరలేక మాటలు, మనస్సు తిరిగి వస్తాయో, ఆ బ్రహ్మానందాన్ని తెలుసుకున్న వ్యక్తి దేనికీ భయపడడు. నేను మంచి ఎందుకు చేయలేదు , నేను పాపం ఎందుకు చేసాను అన్న ఆలోచనలు అతనికి రావు".


5. మాండుక్యోపనిషత్తు


"ఓంకారం - ఇది శాశ్వతం. ఏది గతం లో ఉండేదో , వర్తమానంలో ఉందో, భవిష్యత్తులో ఉంటుందో, అదంతా ఓంకారమే. త్రికాలాలకు అతీతంగా ఉన్నదంతా ఓంకారమే".


6. కేనోపనిషత్తు


"మనస్సు దేనిని గ్రహించలేదో, ఏది మనస్సుని గ్రహిస్తుందో దానిని మాత్రమే బ్రహ్మంగా గుర్తించు".


7. శ్వేతాశ్వతారోపనిషత్తు


"వేయి తతలు, వేయి కళ్లు మరియూ వేయి పాదాలు కలిగి సర్వ వ్యాప్తమైన అఖండ శక్తి , మన బొడ్డుకు పది అంగుళాల పైన హృదయంలో నివాసమై ఉంది".