సత్యనారాయణ స్వామి వ్రతము - Online Pujalu - ఆన్లైన్ పూజలు

15, జులై 2020, బుధవారం

సత్యనారాయణ స్వామి వ్రతము


సత్యనారాయణ స్వామి వ్రత విశిష్టత:


కలియుగములో ఎంతటి కష్టం అయినా అతి సులువుగా తొలగిపోవాలంటే అతి సులభమయిన మార్గము సత్యనారాయణ స్వామి వ్రతము చేయుట, ఏదయినా కార్యము చేసేముందు ఈ వ్రతాన్ని చేస్తే వారు చేసే కార్యము ఎలాంటి విఘ్నము లేకుండగా జరుగుతుంది.

ఎవరయినా కష్టాలలో ఉంటే ఆ కష్టాన్ని తొలగించుకోవటానికి ఈ వ్రతాన్ని చేసుకోవటము మంచిది.

సత్యనారాయణ స్వామి వ్రత విధానం: 


మనము ఏరోజు అయితే వ్రతాన్ని చేసుకోవాలనుకుంటామో ఆ రోజు ఉపవాసము ఉండి స్వామి వారి వ్రత పీటను ఉంచే స్థలం లో గోమయం, గంగాజలం, గోమూత్రం తో శుధ్ధిచేసి వరిపిండి మరియు అయిదు రంగుల పిండితో ముగ్గులు వేసి స్వామివారి పీటను ఉంచి ఆ పీట పైన తెల్లని వస్త్రాన్ని పరచి దానిపై బియ్యాన్ని పోసి, నవగ్రహాలను అధిదేవత, ప్రత్యధిదేవతా సహితంగా మంటపారాధన చేసి అటుపైన కళశాన్ని ఉంచి స్వామి వారిని ఆవాహన చేసి గనపతి పూజ , నవగ్రహ పూజ, అష్టదిక్పాలక పూజ, పంచలోక పాలికల పూజ చేసి తర్వాత స్వామివారి ప్రతిమకు పంచామృతాలతో అభిషేకము కావించి స్వామి వారి అష్టోత్తర శత నామాలతో షోడశోపచార పూజ చేసిన తరవాత స్వామి వారి అయిదు కథలని విని స్వామి వారికి ప్రసాద నివేదన చేసి, మహా హారతి ఇచ్చి ప్రదక్షణ చేసి తీర్థ ప్రసాదాలు తీసుకోవడముతో వ్రత విధానము సమాప్తమవుతుంది.  

సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఎపుడు చేసుకోవాలి:


మాఘమాసం, వైశాఖమాసం, కార్తికమాసం ప్రశస్తము. మిగిలిన ఏ శుభదినములలో అయినా , ఏకాదశి, పౌర్ణమి తిథి యందు అయినా మనము సంకల్పించుకున్న ఏ శుభ తిథిలో అయినా వ్రతాన్ని చేసుకోవచ్చు.

సత్యనారాయణ వ్రతానికి కావలసిన వస్తువులు:


1. పసుపు - 200 గ్రాములు.
2. కుంకుమ - 100 గ్రాములు.
3. అగరుబత్తీలు - 1 ప్యాకు.
4. హారతి కర్పూరం - 1 ప్యాకు.
5. ఖర్జూరాలు - 150 గ్రాములు.
6. తెల్ల బాగాలు [వక్కలు] - 150 గ్రాములు.
7. తమలపాకులు - 30.
8. చిల్లర రూపాయి బిల్లలు - 50.
9. అరటి పండ్లు - ఒక డజను.
10. జామపండ్లు - 2.
11. బియ్యం - 8 కిలోలు.
12. జాకెట్ ముక్కలు - 3.
13. ఎండు కుడకలు - 1/2కిలో.
14. కళశానికి - ఒకవెండి చెంబు లేదా రాగి చెంబు.
15. కొబ్బరికాయలు - 6.
16. కొబ్బరిబోండా - 1.
17. ఆవు పాలు - 1/2 లీటరు.
18. ఆవు పెరుగు - 100గ్రాములు.
19. ఆవు నెయ్యి - 50 గ్రాములు.
20. తేనె - 50గ్రాములు.
21. చక్కర[పంచదార] - కిలోన్నర.
22. కంకణాలకి దారం.
23. విడిపూలు , పూలదండలు, మామిడీ ఆకులు.
24. గంధం డబ్బా - 1.
25. పసుపుకొమ్ములు - 250గ్రాములు.
26. తువాళ్లు - 1. 
27. గోమయం.
28. గంగాజలం.
29. వరిపిండి + 5 రంగులు ముగ్గు కోసం
30. మంగళ హారతి పళ్లెం.
31. ఆచమన పాత్ర [ఉద్దరణి / పంచపాత్ర].
32. గంట.
33. దీపారాధన సామాగ్రి [వత్తులు, ప్రమిదలు -5, అగ్గిపెట్టె].
34. నూనె - 1/2 కిలో.
35. గోధుమ రవ్వ - కిలో.
36. కూర్చునే పీటలు లేదా చాపలు.
37. సత్యనారాయణ స్వామి వారి ప్రతిమ లేదా ఫోటో. 
38. స్వామివారి పీట.