మంగళ హారతి [ రామచంద్రాయ ] - Online Pujalu - ఆన్లైన్ పూజలు

1, అక్టోబర్ 2020, గురువారం

మంగళ హారతి [ రామచంద్రాయ ]


రామచంద్రాయ జనక రాజజామనోహరాయ

మామకాభీష్టదాయ మహితమంగళం  ||రామ||


కౌసలేయాయ మంద హాసదాస పోషణాయ

వాసవాది వినుత సద్వరద మంగళం  ||రామ||


చారుకుంకుమోపేత చందనాను చర్చితాయ

హారకటక శోభితాయ భూరిమంగళం ||రామ||


లలితరత్న కుండలాయ తులసీవన మాలికాయ

జలజ సదృశ దేహాయ చారుమంగళం ||రామ||


దేవకీ పుత్రాయ దేవదేవోత్తమాయ

భావజాత గురువరాయ భవ్యమంగళం ||రామ||


పుండరీకాక్షాయ పూర్ణచంద్రాననాయ

అండజాత వాహనాయ యతులమంగళం ||రామ||


విమలరూపాయ వివిధ వేదాంతవేద్యాయ

సుజనచిత్త కామితాయ సుభగమంగళం ||రామ||


రామదాస మృదులహృదయ తామరస నివాసాయ

స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం ||రామ||