న్యూమరాలజీ - 1 వ సంఖ్య వారి జాతక విశేషాలు - Online Pujalu - ఆన్లైన్ పూజలు

13, నవంబర్ 2020, శుక్రవారం

న్యూమరాలజీ - 1 వ సంఖ్య వారి జాతక విశేషాలు

1, 10, 19, 28  తేదీలలో జన్మించినవారు  1 వ సంఖ్య వారు అవుతారు.


Example:

  • 10 = 1+0 = 1
  • 19 = 1+9 = 10 = 1  + 0 = 1
  • 28 = 2+8 = 10 = 1 + 0 = 1

1 వ సంఖ్య వారుమధ్య రకము ఎత్తు కలవారు, చక్కని పలువరుస , మంచి ఆకర్షనీయమయిన మాటలు మాట్లాడేవారుగా ఉంటారు.


స్థిరమయిన మనస్సు కలవారు , అందరికీ సహాయం చేస్తారు, వీరికి పట్టుదల అధికము కానీ కొన్నిసార్లు బయటివారికి మొండితనంగా అనిపిస్తుంది, వీరు ఏ పని మొదలుపెట్టినా దీక్షగా ఆ పని అయ్యేవరకు ప్రయత్నిస్తారు.


వీరు నిష్కల్మషంగా మనసులో ఏముందో అది మాట్లాడేస్తారు, కొన్ని సార్లు తొందరపాటు గా అనిపించింది మాట్లాడటం వలన అవతల వాళ్లు నొచ్చుకుంటారు, వీరి వలన సహాయం పొందిన వాళ్లు కూడా ఒకొకసారి వీరిని చిన్న చూపు చూస్తారు ఈ తొందరపాటు మాటల వలన.


వీరు బహు సున్నిత మనస్కులు, వీరు రహస్యములను అంతగా దాచలేకపోవచ్చు.


వీరిపైన వీరికి నమ్మకం ఎక్కువ, చాలా ఆత్మవిశ్వాసం కలవారు అవటం వలన వెరు ఏ విద్యనయినా చాలా తేలికగా నేర్చుకోగలుగుతారు.


వీరు తమ గౌరవానికి భంగం రాకుండా జాగ్రత్త పడతారు, ఎదుటి వారి ప్లాన్ లు కనిపెట్టి ఎత్తుకు పై ఎత్తు వేయగల సమర్థులు.


వీరు ఎవరి సహాయం లేకుండా , ఎవరి సహాయం పొందకుండా అభివృద్ది పొందాలనుకుంటారు, వీరికి ప్రశాంత వాతావరణం అంటే చాలా ఇష్టం గా ఉంటుంది, వీరు సంఘం లో చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులని పొందటానికి అవకాశం ఎక్కువ.


వీరు ఉద్యోగం లేదా వ్యాపారం లేదా రాజకీయాలలో ప్రఖ్యాతి పొందటానికి అవకాశం ఉంది.


వీరు సహాయం ఎక్కువగా చేసి చిక్కులు తెచ్చుకునే అవకాశం ఉంది, కాబట్టి చూసుకుని సహాయం చేయటం మంచిది.


వీరికి తమంతటి వారు లేరనే భావన ఉంటుంది, వీళ్లని పొగిడి పని చేయించుకోవటం సులభం, వీళ్లు కుటుంబానికి ఎంత ఖర్చయినా చేయటానికి సిద్దంగా ఉంటారు, అలాగే వీరు ఎదుటి వారి కష్టాన్ని చూడలేని సున్నిత మనస్కులు అవటం వలన సులభంగా సహాయం చేసేస్తారు.


వీరు జీవితం మొదటి భాగం కన్న రెండవ భాగం చాలా ఆనందదాయకంగా ఉంటుంది.


వివాహ జీవితం 


ఈ 1 వ సంఖ్య వారికి కాస్త ఆలస్యంగా వివాహం జరగటానికి అవకాశం ఉంది, వీరికి వ సంవత్సరం లో వివాహం జరగటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది,  1 వ సంఖ్య వారు 2, 4, 7, 8 సంఖ్య ల వారిని వివాహం చేసుకొన్న శుభదాయకం.

వీరి దాంపత్య జీవనం సుఖదాయకంగా ఉంటుంది, దంపతుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తినా వెంటనే తగ్గిపోవును.

వీరి సంతానం చాలా యోగ్య ప్రదంగా ఉండును.

ఆర్థిక జీవితం 

ఈ 1 వ సంఖ్య వారు ఆర్థికంగా బాగానే సెటిల్ అవటానికి అవకాశం ఉంది, ౩౦ నుండి 35 సంవత్సరాల మధ్య వీరికి బాగా కలసివచ్చి ఊహించని అభివృద్ది కి ఆస్కారం ఉంది.

ఖర్చులు ఎక్కువ ఉన్నప్పటికి ధనం రాబడి కూడా బాగానే ఉంటుంది, కానీ వీరు పేరు కోసం ఖర్చు ఎక్కువ చేయటానికి అవకాశం ఎక్కువ, వీరు ఎదుటివారి బాధని చూదలేని సున్నిత మనస్కులవటం మూలంగా సంపాదించిన దాంట్లో ఎక్కువగ ఖర్చు పెడతారు, అలాగే మొండి వైఖరి కారణంగా అదృష్టవశాత్తు లభీమ్చిన వాటిని కూడా వీరు వదిలివేయటానికి అవకాశం ఉంది.

వీరు చూసి జాగ్రత్తగా ఖర్చు చేసుకోవటం మంచిది.

ఆరోగ్య జీవితం 


వీరికి ఆరోగ్యం పట్ల కాస్త ఎక్కువ శ్రధ్ద అవసరం, వీరు నేత్ర సంబంధమయిన, ఉదర సంబంధమయిన జాగ్రత్తలు తీసుకోవటం సూచితం.

వీరికి అనేక అలవాట్లు ఉన్ననూ అనుకున్న వెంటనే మానివేయగల మానసిక శక్తి వీరి సొంతం.

సూచనలు

వీరికి ఏ ఉంగరం, దుస్తులు మొదలయినవి శుభమో కింద చదవండి.

  • జాతి కెంపు ఉంగరం
  • ఎరుపు, ఆకుపచ్చ , తెలుపు రంగు దుస్తులు
  • ఉత్తరం, తూర్పు ముఖం కలిగిన ఇల్లు లేదా ఆఫీసు
  • 1, 8 అదృష్ట సంఖ్యలు
  • బంగారు ఆభరణాలు శుభం
  • అనుకూల తేదీలు 1, 4 10, 28, 31.