భగవద్గీత పారాయణ ఫలాలు - Online Pujalu - ఆన్లైన్ పూజలు

14, జూన్ 2021, సోమవారం

భగవద్గీత పారాయణ ఫలాలు

 భారతీయ వేదాంత దర్శనం సర్వస్వం భగవద్గీత లో సాక్షాత్కరిస్తుంది, పుట్టిన ప్రతివాడికి సంబంధించిన విషయాలే భగవద్గీత లో చెప్పబడినవి. 


భగవద్గీత ను నియమం తో పారాయణ చేయటం వలన పుణ్యం పెరిగి మంచి ఫలాలని అనుభవిస్తారు. అంతేకాని పాపాలు పోతాయి అని భగవద్గీత పారాయణ చేయకండి, పాపాలు తగ్గవు పాపాలకి ఫలితాలని అనుభవించక తప్పదు, కానీ పుణ్యం పెరిగి మంచి ఫలితాలని పొందవచ్చ్హు.


1. అర్జున విషాద యోగం : దీనిని చదవడం వలన మానవుడికి పూర్వజన్మ స్మృతి కలుగుతుంది.


2. సాంఖ్య యోగం : దీనిని చదవడం వలన ఆత్మ స్వరూపం తెలుస్తుంది.


3. కర్మయోగం : దీన్ని చదవడం వలన ప్రేతత్వం నశిస్తుంది.


4,5. జ్ణానయోగం , కర్మ సన్యాస యోగం : ఈ అధ్యాయాలు పారాయణ వలన చెట్లు, పశువులు, పక్షులు కూడా ఉత్తమ గతిని పొందుతాయని అంటారు.


6. ఆత్మ సంయమ యోగం : ఈ అధ్యాయ పారాయణ వలన సమస్త దానాల ఫలితం కలుగుతుంది.


7. విజ్ణాన యోగం : ఈ అధ్యాయ పారాయణ వలన జన్మ రాహిత్యం కలుగుతుంది.


8. అక్షర పరబ్రహ్మ యోగం : ఈ అధ్యాయ పారాయణ వలన స్థావరత్వం, బ్రహ్మరాక్షసత్వం తొలగిపోతుంది.


9. రాజవిద్యా రాజగుహ్య యోగం : ఈ అధ్యాయ పారాయణ వలన ఇతరుల దగ్గరనుండి ఏదయినా వస్తువు తీసుకున్నందుకు వారి నుండి మనకి సంక్రమించిన పాపం నశిస్తుంది.


10. విభూతియోగం : ఈ అధ్యాయ పారాయణ వలన ఆశ్రమ ధర్మాన్ని సక్రమంగా నిర్వహిస్తే ఏ పుణ్యం కలుగుతుందో ఆ పుణ్యం కలుగుతుంది, జ్ణానం పెరుగుతుంది.


11. విశ్వరూప సందర్శన యోగం : ఈ అధ్యాయ పారాయణ వలన ముక్తి లభిస్తుంది.


12. భక్తి యోగం : ఈ అధ్యాయ పారాయణ వలన ఇష్టదేవతా కటాక్ష్యం లభిస్తుంది.


13. క్షేత్ర క్షేత్రజ్ణ విభాగ యోగం : ఈ అధ్యాయ పారాయణ వలన అజ్ణానం నశిస్తుంది.


14. గుణత్రయ విభాగ యోగం : ఈ అధ్యాయ పారాయణ వలన వ్యభిచార దోశం నశిస్తుంది.


15. పురుషోత్తమ ప్రాప్తి యోగం : ఈ అధ్యాయ పారాయణ వలన ఆహార శుద్ది కలుగుతుంది.


16. దైవాసుర సంవద్విభాగ యోగం : ఈ అధ్యాయ పారాయణ వలన బల పరాక్రమాలు, సుఖం లభిస్తాయి.


17. శ్రద్దాత్రయ విభాగయోగం : ఈ అధ్యాయ పారాయణ వలన వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది.


18. మోక్ష సన్యాస యోగం : ఈ అధ్యాయ పారాయణ వలన సమస్త యజ్ణాచరణ ఫలం కలుగుతుంది.