దసరా నవరాత్రులు - అమ్మ వారి అలంకారాలు ప్రసాదాలు - Online Pujalu - ఆన్లైన్ పూజలు

14, జూన్ 2021, సోమవారం

దసరా నవరాత్రులు - అమ్మ వారి అలంకారాలు ప్రసాదాలు

 ఏటా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచీ ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తారు. దేవీ నవరాత్రులలో భాగంగా, అమ్మవారిని ఒక్కోరోజు ఓక్కో రూపంలో పూజిస్తారు. 


అమ్మవారి ఒక్కో రూపానికీ ఒక్కో పూజ ఉన్నట్లే అమ్మవారికి సమర్పించే నైవేద్యం కూడా వేర్వేరుగా ఉంటుంది. ఏ రూపంలో ఉన్న అమ్మవారికి ఏ నైవేద్యం అంటే ఇష్టమో తెలుసుకుందాం.


తొలిరోజు - శ్రీ బాలత్రిపుర సుందరీ దేవి, పొంగల్

రెండో రోజు - గాయత్రీ దేవి, పులిహోర

మూడో రోజు - అన్నపూర్ణా దేవి, కొబ్బరి అన్నం

నాల్గో రోజు - కాత్యాయని దేవి, గారెలు

ఐదో రోజు - లలితా దేవి, దద్ధోజనం (పెరుగు అన్నం)

ఆరో రోజు - శ్రీ మహాలక్ష్మీ దేవి, రవ్వ కేసరి

ఏడో రోజు - మహా సరస్వతి దేవి, కదంబం

ఎనిమిదో రోజు - మహిషాసుర మర్ధిని, బెల్లం అన్నం

తొమ్మిదో రోజు - రాజరాజేశ్వర దేవి, పరమాన్నం.