చక్కెర పొంగలి - తయారీ విధానం - Online Pujalu - ఆన్లైన్ పూజలు

14, జూన్ 2021, సోమవారం

చక్కెర పొంగలి - తయారీ విధానం

 బియ్యం, పాలు, బెల్లం ఉంటే చాలు చక్కెర పొంగలి తయారవుతుంది, సులభంగా చేసుకోగలిగే చక్కెర పొంగలి ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


కావలసిన పదార్థాలు:


బియ్యం - 1 కప్పు

పెసరపప్పు - 1/2 కప్పు

బెల్లం - 1/2 కప్పు

నీళ్లు - 4 గ్లాసులు

నెయ్యి - 1/4 కప్పు

జీడిపప్పు - 10

కిస్మిస్ - 10

కొబ్బరి ముక్కలు - 6

యాలకుల పొడి - చిటికెడు

పచ కర్పూరం పొడి - చిటికెడు

జాజికాయ పొడి - చిటికెడు


తయారీ విధానం:


స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసి పెసర పప్పును దోరగా వేయించుకోవాలి, వేయించుకున్న పెసర పప్పుకి బియ్యం కలిపి ఉడికించాలి. వేరే గిన్నె లో బెల్లం వేసి కొన్ని నీళ్లు పోసి చిన్న మంటపైన ఉడికించాలి, బెల్లం పానకం చుక్కని నీటిలో వేస్తే కరగకుండా అడుగుభాగానికి చేరుకున్నట్లయితే పానకం తయారయినట్టే. ఈ పానకంలో ఉడికించి పెట్టుకున్న బియ్యం, పెసర పప్పు మిశ్రమాన్ని వేసి కలిపి చిన్న మంటపైన అయిదు నిముషాలు ఉడికించాలి, తరవాత నెయ్యి వేసి మరికాసేపు ఉడికించాలి, తరవాత యాలకుల పొడి, పచ కర్పూరం పొడి, జాజికాయ పొడి , జీడీపప్పు, కిస్మిస్ వేసి కలిపితే చక్కర పొంగలి తయారు అవుతుంది.


భగవంతునికి అర్పించడానికి చక్కెర పొంగలి సిద్దం.