నిత్య సత్యాలు - ఆణిముత్యాలు - Online Pujalu - ఆన్లైన్ పూజలు

14, జూన్ 2021, సోమవారం

నిత్య సత్యాలు - ఆణిముత్యాలు

 1. వందకోట్లకు అధిపతివయినా, నిమిషం ఆయుష్యును కొనలేవని తెలుసుకో.

2. కోటి కోట్లకు అధిపతివైనా ఊపిరి పోగానే ఊరిబయట పడవేస్తారని తెలుసుకో.

3. వందమంది డాక్టర్లు నీ వెంట ఉన్నా నీ పరలోక ప్రయాణమును ఆపలేరని తెలుసుకో.

4. ప్రపంచానికి అధిపతివైనా నీ ఆయుష్యుకు అధిపతివి కాలేవని తెలుసుకో.

5. ఎంత అన్నం నీ శరీరానికి చాలో అంతే తిను, ఎక్కువ అన్నం నీ శరీరాన్ని పాడుచేస్తుంది, తక్కువ అన్నం నీ శరీరాన్ని రక్షించడానికి సరిపోదు.

6. మితముగా సంపాదించు, శాంతిగా ఉండండి, ఆందోళన తగ్గించుకోండి, సుఖంగా జీవించండి.