విఘ్నేశ్వర నమస్కారస్తోత్రమ్ - Online Pujalu - ఆన్లైన్ పూజలు

14, జూన్ 2021, సోమవారం

విఘ్నేశ్వర నమస్కారస్తోత్రమ్

 జయ విఘ్నేశ్వర నమో నమో, జగద్రక్షకా నమో నమో

జయకర శుభకర సర్వపరాత్పర జగదుద్దారా నమో నమో


మూషికవాహన నమో నమో, మునిజనవందిత నమో నమో

మాయారాక్షసమదాపహరణా మన్మధారిసుత నమో నమో


విద్యాదాయక నమో నమో విఘ్నదారక నమో నమో

విశ్వసృష్టిలయకారణ శంభో, విమలచరిత్రా నమో నమో


గౌరీప్రియసుత నమో నమో గంగానందన నమో నమో

గంధర్వాద్భుతగానవినోదా గణపతిదేవా నమో నమో


నిత్యానందా నమో నమో నిజఫలదాయక నమో నమో

నిర్మల పురవర నిత్యమహోత్సవ రామనాథనుత నమో నమో